జగ్గయ్యపేట ‘మున్సిపల్‌’ వైయస్‌ఆర్‌ సీసీ కైవసం

కృష్ణా:

జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ గట్టిదెబ్బ తగిలింది. బలంలేక ఎన్నికను వాయిదా వేయాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలు ఫలించలేదు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్‌ ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగ్గయ్యపేట మున్సిపల్‌ పరిధిలో మొత్తం 27 స్థానాలు ఉండగా వాటిల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 16 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. దీంతో బలం లేకపోయినా చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవాలని శుక్రవారం టీడీపీ నేతలు ఎన్నిక హాల్‌లో బీభత్సం సృష్టించారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారంటూ హైడ్రామాకు తెరలేపారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి ఎన్నికను శనివారానికి వాయిదా వేసిన తెలిసిందే. కాగా శనివారం వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్‌ ఇంటూర్‌ రాజగోపాల్‌ను ఏకగ్రీవంగా చైర్మన్‌ పదవికి ఎన్నుకున్నారు.

Back to Top