జగన్‌ నిర్దోషి అని చెప్పేందుకే 'జనం సంతకం'

తిరుపతి, 2 జనవరి 2013: 'జనం సంతకం'‌ శ్రీ జగన్ ఏ తప్పూ చేయలేదని ఎలుగెత్తి చాటేందుకే అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. అంతే కానీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ కోసమే సంతకాల సేకరణ చేపట్టలేదన్నారు. శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం తిరుపతిలో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ ప్రక్రియను తప్పుబడుతున్న వారికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
Back to Top