జగన్‌ కోసం జైలును ముట్టడిస్తాః రెహ్మాన్

హైదరాబాద్­, ఆగస్టు 23: వైయస్­ జగన్మోహన్­ రెడ్డికి బెయిలు ఇవ్వకుండా తాత్సారం చేస్తే చంచల్­గూడ జైలును ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్సీ, వైయస్­ఆర్­సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు హెచ్­ఏ రెహ్మాన్ హెచ్చరించారు. ఆయనకు బెయిలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలతో వచ్చి జైలును ముట్టడిస్తామని చెప్పారు. జగన్‌ను కలిసేందుకు అనుచరులతో గురువారం జైలుకు వచ్చిన రెహ్మాన్­­.. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు దగ్గరే ఉండిపోయారు. విషయం తెలిసిన మీర్‌చౌక్ ఏసీపీ కిష్టయ్య అక్కడకు చేరుకుని జైలు అధికారులను సంప్రదించారు.

రెహ్మాన్‌కు అనుమతి ఇవ్వలేమని వారు చెప్పగా అదే విషయాన్ని బయటకు వచ్చి చెప్పా రు. దీంతో రెహ్మాన్ ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. ఏసీపీ సర్దిచెప్పడంతో చివరికి శాం తించారు. ములాఖత్‌ల నిరాకరణ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అనుమతి ఇవ్వకపోతే జైలు ముందు బైఠాయిస్తానని రెహ్మాన్ హెచ్చరించారు.

Back to Top