'జగనన్న సీఎం కావడం ఖాయం'

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా):

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజల కాష్టాలు తీరుతాయని ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిస్తామంటూ శపథం పూనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

     తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ కుమార్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బి. కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన మాట్లాడారు. సోదర సమానుడైన ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పార్టీలకు సమయం వచ్చినప్పుడు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు.

Back to Top