జగనన్న రాకతో ప్రజల్లో చైతన్యం...

విశాఖః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాకతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని విశేష సంఖ్యలో ప్రజలు జగనన్నకు అండగా  నడుస్తున్నారన్నారు. మంత్రి నియోజకవర్గమైన భీమిలిలో సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈనాం భూముల సమస్య ఉందన్నారు. ప్రజలందరూ వైయస్‌ జగన్‌తో తమ సమస్యలను విన్నవించుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  న్యాయం చేస్తామని జననేత హామీ ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్రలో ప్రజా సంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయి దాటడం గర్వకారణంగా ఉందన్నారు. భీమిలి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటువేశామా అని  ప్రజలు బాధపడుతున్నారన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు, యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో  ధనిక,పేద తారతమ్యం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందరికి వర్తింపచేశారని, టీడీపీ పాలనలో  కోటా పద్దతిలో ఇస్తూ వైయస్‌ఆర్‌ స్ఫూర్తిని దెబ్బతిశారన్నారు.దీంతో పేద విద్యార్థులు చదువులు ఆపేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Back to Top