తక్షణమే బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపాలి

హైదరాబాద్ః తాను తల్చుకుంటే ఓటుకు రూ. 5వేలు ఇవ్వగలనన్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ రోజున ఓటుకు నోటు కేసులో రూ. 5కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు... ఇవాళ రూ. 5వేలతో ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top