ఇడుపులపాయకు చిత్తూరు మహిళల యాత్ర

చిత్తూరు, 1 సెప్టెంబర్‌ 2012 : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిని మరచిపోలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలని వైయస్‌‌ఆర్‌ చేసిన కృషి అనితర సాధ్యమని వారు అన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు యాత్రగా బయలుదేరారు. వీరంతా మహానేత వైయస్ఆ‌ర్ మూడవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఘా‌ట్‌ను దర్శించి, నివాళులు అర్పించుకోవడానికి ఇడుపులపాయకు పయనమయ్యారు. మహానేత అంటే తమకు ప్రాణమని మహిళలంతా ముక్తకంఠంతో చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top