రెండు గంటలకే సభ మూసేయాలని చట్టం ఉందా..?

()ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు
()గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై..
చర్చను ఒకరోజుకే పరిమితం చేయడంపై వైఎస్ జగన్ ఫైర్

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను ఒక్కరోజుకే పరిమితం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నది అధికార, ప్రతిపక్షం రెండు పార్టీలేనని వైఎస్ జగన్ చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి టీడీపీ దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు. కనీసం ప్రతిపక్ష సభ్యుడు ఒక్కరైనా గవర్నర్ ప్రసంగం పూర్తిచేసేందుకు అవకాశం ఇవ్వకపోతే ..ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదన్నారు. 

చంద్రబాబు ప్రజలు చూస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని వైఎస్ జగన్ హితవు పలికారు. 'గవర్నర్ ప్రసంగంపై రెండు రోజుల చర్చ ఉంటుందని మీరే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కరోజుకే పరిమితం అవుతుందని అంటున్నారు. గత సమావేశాల్లోనేమో  చర్చ జరగవద్దని అంబేద్కర్ టాపిక్ ను తీసుకొచ్చారు. ఇప్పుడేమో మహిళా దినోత్సవాన్ని తీసుకొచ్చారని వైఎస్ జగన్ ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగట్టారు.  తమకు  మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.  టీడీపీ ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెబుతుంది, చేయాలనుకున్నది చేసేస్తుంది. ఇంతటితో అయిపోయిందని చేప్పే కార్యక్రమం చేస్తున్నారని వైఎస్  జగన్ అధికారపార్టీపై  ఫైరయ్యారు.

తన ప్రసంగం గంటన్నర కాకపోతే రెండు గంటలు అవుతుంది. ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కళ్లయినా పూర్తిగా మాట్లాడే వీలు కల్పించండి. ప్రజలు చూస్తున్నారు.. ఈ బడ్జెట్ సమావేశాల్లో కనీసం ప్రజలకైనా న్యాయం చేయించాలని వైఎస్ జగన్ సభనుద్దేశించి ప్రసంగించారు. అవి కూడా జరగనివ్వము, ప్రసంగాలను మధ్యలోనే కట్ చేస్తామంటే మేం చేయగలిగింది ఏమీ లేదన్నారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లి మిగిలిన ప్రసంగం చదువుతాము.. దానివల్ల చెడ్డపేరు వచ్చేది మీకేనని చెప్పారు.  

మా పార్టీలో ఎవరు ఎంతసేపు మాట్లాడాలో అధికార పక్షం డిక్టేట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకే సభను మూసేయాలని చట్టం ఏమైనా ఉందా.. అవసరాన్ని బట్టి సాయంత్రం 4, 6, 8 గంటల వరకు పొడిగించండి. ఈ కొత్త కొత్త థియరీలేంటి.. ప్రతిపక్ష నేత మాట్లాడితే మీకు ఎందుకంత భయం? అని జననేత ప్రభుత్వాన్ని నిలదీశారు.  వైఎస్  రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాత్రి 8 గంటల వరకు సభ జరిగేది. సమావేశాలు కూడా 25 రోజులు కాదు.. 75 రోజులు జరిగాయి. మీ లాగా  2 గంటలకే మూసేసి పరిగెట్టాలన్న ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు'' అని టీడీపీ సర్కారను తూర్పారబట్టారు. 
Back to Top