మీ త్యాగాలే స్ఫూర్తి

 
రాజీనామా అనంతరం మొదటిసారి జిల్లాకు ఎంపీలకు ఘన స్వాగతం
ఒంగోల్ లో వైవీ సుబ్బారెడ్డికి ఘ‌న స్వాగ‌తం 
వైయస్ఆర్ జిల్లాలో వైయస్ అవినారెడ్డికి బ్రహ్మరథం
నెల్లూరులో మేకపాటికి ఆత్మీయ స్వాగతం
చిత్తూరులో మిథున్ రెడ్డి, వరప్రసాద్ కు పూలమాలలతో కోలాహలంగా స్వాగతం 
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

   
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో అలుపెరగని పోరాటం సాగించి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలో ప్రథమ భూమికను పోషించడమే కాకుండా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని త్రుణప్రాయంగా భావించి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా అనంతరం సొంత నియోజకవర్గాలకు రావడంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు చేసిన త్యాగాన్ని ప్రజలు గుర్తు చేసుకొని వారికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో మేకపాటి రాజమోహన్ రెడ్డికి, చిత్తూరులో వరప్రసాద్, మిథున్ రెడ్డి, వైయస్ఆర్ జిల్లా అవినాష్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. వందలాది వాహనాలలో వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని శింగరకొండ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఒంగోలు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అడుగడుగునా పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ వైవీకి ఘనస్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు. మహిళలు హారతులు పట్టారు. హోదా కోసం ఎంపీ పోరా టాన్ని కీర్తించారు. దారి పొడవునా వైఎస్‌ఆర్‌ విగ్రహాలతో పాటు అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో శింగరకొండకు చేరుకున్నారు. అక్కడ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గరటయ్యతో పాటు ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్‌యాదవ్, రావి రామనాథంబాబు, ఐ.వి.రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, అట్లా చినవెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కృష్ణచైతన్యలతో పాటు ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత స్థానిక ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఎంపీ పూజలు నిర్వహించారు.   

ఎంపీ వెంటవైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, పటాపంజుల శ్రీనివాస్, కొఠారి రామచంద్రరావు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, గోలి తిరుపతిరావు, ఎస్‌.రవణమ్మ, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, చుండూరి రవిబాబు, నాగిరెడ్డి, కేవీ ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, పులుగు అక్కిరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, లంకపోతు అంజిరెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, వీఆర్‌సీ రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పటాపంజుల అశోక్, దుంపా చెంచిరెడ్డి, కొమ్ము సామేలు, భక్తవత్సలరెడ్డి, షేక్‌ నాగూర్, పి.రామసుబ్బారెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, ఆర్లారెడ్డి, వర్దుశేషయ్య, కండే రమణయ్య యాదవ్, వెంకాయమ్మ, ఈశ్వరమ్మ, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, నాగూర్, ఇనగంటి పిచ్చిరెడ్డి, వాకా రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వేణు, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, జేమ్స్‌ తదితరులు ఉన్నారు. 

 వైయస్ఆర్ జిల్లా

ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆమరణ నిరాహారదీక్ష చేసి మొదటిసారి కడపకు విచ్చేసిన పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా నగర శివారు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీగా బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. నగర శివారుల్లో  ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు అంజద్‌ బాషా, రవీంద్రానాధ్‌ రెడ్డి, రఘురామిరెడ్డి, మేయర్‌ సురేశ్‌ బాబు ఉన్నారు.




Back to Top