జీతాలు సరిపోక కుటుంబపోషణ భారమైంది

ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదు
వైయస్‌ఆర్‌ మరణించడం మా దురదృష్టం
వైయస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన పంచాయతీ కార్మికులు
తూర్పుగోదావరి: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సరిపోక కుటుంబపోషణ భారమైంది. వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే తమ బతుకులు బాగుపడేవని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగ్గంపేటలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గ్రామ పంచాయతీ కార్మికులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలు వివరించారు. 25 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని వైయస్‌ జగన్‌కు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్‌ అంటున్నాయని, స్వచ్ఛభారత్‌ చేసే మమ్మల్ని వదిలేసి.. ఫొటోలు తీసుకొని వారు గొప్పలు చెప్పుకుంటున్నారని వాపోయారు. స్వచ్ఛభారత్‌లో కీలకపాత్ర వహిస్తున్న కార్మికులను న్యాయం చేయాలని కోరారు. అర్హులైనవారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. జిల్లాలో సెక్రెటరీ, బిల్‌ కలెక్టర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయని, వాటికి కాంట్రాక్ట్‌ పద్ధతి చేపడుతామంటున్నారని.. మొదటి ప్రాముఖ్యత తమకు ఇవ్వాలన్నారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న మేం ఏమైపోయవాలని ప్రశ్నించారు. గతంలో గ్రామ నౌకర్లుగా చేసినవారు వీఆర్‌ఓలు అయిపోయారని, అదంతా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమన్నారు. ఆయన చనిపోయిన తరువాత తమను ఎవరూ పట్టించుకోవడం లేదని అది మా దురృష్టమన్నారు. వైయస్‌ జగన్‌ వచ్చిమాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. 
Back to Top