జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఘంటా మురళి

హైదరాబాద్ :

చింతలపూడి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర చిన్ననీటి పారుదల సంస్థ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ శుక్రవారం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబా‌ద్‌ లోటస్‌పాండ్‌కు తన అనుచరులతో కలిసి వచ్చిన మురళి పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.‌ మురళిని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేశ్‌కుమార్ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువచ్చారు. మురళితో పాటు చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌  తూతా లక్ష్మణరావు, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, రావికంపాడు సర్పంచ్ ఏసుబాబు, పలువురు కాంగ్రె‌స్ కార్యకర్తలు కూడా వై‌యస్ఆర్‌ సీపీలో చేరారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమర్థతను చూసే తాను పార్టీలో చేరానని ఘంటా మురళీ రామకృష్ణ చెప్పారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కాంగ్రె‌స్ పాలకుల తీరు వల్ల నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‌ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాల న్నా.. రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. ప్రజలకు మేలుచేసే మరిన్ని కొత్త పథకాలు రావాలన్నా జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు.

తాజా ఫోటోలు

Back to Top