వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ :  కేసీఆర్ తన రెండేళ్ల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సూచించారు.  కాసేపటి క్రితం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఏమి చేశారో  కసీఆర్ తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. రెండేళ్ల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని  శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top