బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం

ఊటుకూరు(క్రోసూరు, మంగ‌ళ‌గిరి): మండలంలోని ఊటుకూరు గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న నలుగురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను మంగ‌ళ‌వారం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పానెంహ‌నిమిరెడ్డి ప‌రామ‌ర్శించారు. ఊటుకూరు గ్రామంలో ఎస్సీకాలనీకి చెందిన జెర్రిపోతు దానబాబు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులకు ఆపరేషన్లు చేయించుకోగా ఆతనిని పరామర్శించారు. అదేవిధంగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న జెర్రిపోతు మనోహర్, జెర్రిపోతు సుగుణమ్మ, పెరుమాళ్లపల్లి సుశీల ను పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్ధితులు అడిగి తెలుసుకున్నారు. బాధితులు నలుగురికి కొంత మేర ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా హనిమిరెడ్డి ఎస్సీకాలనీలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు. ఆయనతోపాటు పార్టీ గ్రామపార్టీ అధ్య‌క్షుడు గంజిమాల నాగేశ్వరరావు, షేక్‌ మీరావలి, పెరుమాళ్లపల్లి కోటయ్య, తుమ్మపూడి ప్రభారకరరెడ్డి, మాజీ సర్పంచ్‌ జొన్నవరపుశ్రీనివాసరెడ్డి, మర్రికోటిరెడ్డి, అనుముల రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top