వైయస్ జగన్ తో రైతు విభాగం అధ్యక్షుడి భేటీ

హైదరాబాద్: జీవో 271 రైతుల ప్రయోజనాలకు హానికరంగా పరిణమించిందని వైయస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ని నాగిరెడ్డి ఆయన నివాసంలో కలుసుకున్నారు. జీవో 271 వల్ల ఉత్పన్నమవుతున్న దుష్ఫలితాలను, రైతుల్లో నెలకొన్న ఆందోళనను వివరించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని కోరుతూ ...ఈ నెల 23న విజయవాడలో నిర్వహించే అఖిలపక్ష రైతు సంఘాల సమావేశానికి వైయస్సార్‌సీపీ నేతలను పంపాలని ఆయన వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నుంచి ఇద్దరు ముఖ్యనేతలను పంపుతానని వైయస్ జగన్ ఆయనకు హామీ ఇచ్చారు.

Back to Top