రుణ‌మాఫీ మోసంతో రైతు ఆత్మ‌హ‌త్య‌

అనంత‌పురం: చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన రుణ‌మాఫీ మోసం చివ‌ర‌కు ఒక రైతు నిండు ప్రాణాన్ని తీసింది. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కుండ నియోజ‌క వ‌ర్గం రాయ‌ప‌ల్లి లో కోదండ‌రామ్ రెడ్డి అనే యువ‌రైతు ఆత్మ‌హ‌త్య చేసుకొన్నాడు. ఆయ‌న కు 6 ఎక‌రాలు, ఆయ‌న త‌ల్లి కు 5 ఎక‌రాలు ఉంది. దీని మీద ఆయ‌న బ్యాంకు నుంచి రుణాలు తీసుకొన్నారు. రుణ‌మాఫీ జ‌రుగుతుంద‌ని ఆశించి ఆయ‌న క‌ట్ట‌లేదు. కానీ రుణ‌మాఫీ జ‌ర‌గ‌క పోగా, పాత బ‌కాయిలు పేరుకొని పోయాయి. దీంతో ఖ‌రీఫ్ రుణం కోసం ప్ర‌య‌త్నించాడు. బ్యాంకు అధికారులు తిర‌స్క‌రించ‌ట‌మే కాకుండా, వేధించ‌టం మొద‌లెట్టారు. విసిగి వేసారిన కోదండ‌రామ్ బ్యాంకు ఆవ‌ర‌ణ‌లోనే పురుగు మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు
Back to Top