కంటిచూపు ఎంతో అవసరం

బలిజిపేట రూరల్‌:  అందరికి కంటిచూపు ఎంతో అవసరమని, కంటిచూపు కొరవడితే జీవితం అంధకారం అయినట్టేనని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, అజ్జాడ గ్రామ సర్పంచ్‌అక్కేన ఎల్లంనాయుడు తెలిపారు. అజ్జాడలో మంగళవారం వేపగుంట శంకర్‌ ఫౌండేషన్‌ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని ఎల్లంనాయుడు ప్రారంభించారు. మారుమూల గ్రామాలలో ఉండే వృద్ధులు పట్టణాలకు వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం, శస్త్ర చికిత్సలు చేయించుకోవడం ఎంతో కష్టమైన పని అని అటువంటి సేవలు గ్రామాలకు వస్తుంటే వాటిని అందరు సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. శిబిరంలో 75మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 30మంది శస్త్ర చికిత్సలకు ఎంపికయినట్టు వైద్యాధాకారిణి శైలజ తెలిపారు. వీరికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కేన రామమూర్తినాయుడు, సత్యసాయి జోనల్‌యూత్‌కోఆర్డినేటర్‌పి.రాజశేఖరం, తదితరులు పాల్గొన్నారు.

Back to Top