రాజధానిలో ప్రతిదీ స్కామే

  • రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం
  • దళితులపై దౌర్జన్యం
  • అత్తగారి సొత్తులా అసైన్డ్ భూముల దోపిడీ
  • లింగాయపాలెంలో బాధిత రైతులతో వైయస్ జగన్‌
అమరావతి:  రాజధాని ప్రాంతలో జరుగుతున్నది ప్రతిదీ స్కామే. బొగ్గు నుంచి ఇసుక దాకా, మద్యం నుంచి గుడి భూముల దాకా స్కాములే. ఈ రకమైన స్కాములు చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని వైయస్ జగన్  ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లింగాయపాలెంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. ఏమన్నారో వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

రాజధాని పేరు చెప్పి ఏ రకంగా చంద్రబాబు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. భూములు ఇవ్వమని చెప్పిన రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని, వాళ్లను నడిరోడ్డుపై పెట్టి వాళ్ల జీవితాలతో ఎలా చలగాటమాడుతున్నారో ఇవాళ పొద్దునుంచి చాలా గ్రామాల గుండా తిరిగి కొన్ని గ్రామాల్లో రైతులతో మాట్లాడించాను. బాబుకు బుద్ధి, జ్ఞానం వచ్చేలా, ఆయన మీద ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. రాజధానికి వ్యతిరేకమని ఎవరు చెప్పరు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను చూసినపుడు గుండె కరిగిపోతుంది. బాబు మొదటి నుంచి వేస్తున్న అడుగులన్నీ కూడా తప్పుటడుగులే. రాజధాని ఇక్కడ పెట్టాలన్న ఆలోచన తన మనస్సులో ఉండి బాబు రైతులకు చెప్పి ఉంటే సంతోషించేవారు. రాజధాని ఎక్కడో నూజీవీడు, ఆంధ్ర యూనివర్శిటీ ప్రాంతంలో వస్తుందని లీకులు ఇచ్చారు. ఇక్కడ తన బినామీలతో తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేయించారు. సంవత్సరం పోయిన తరువాత అక్కడ కాదు..ఇక్కడే అని డిక్లెర్‌ చేశారు. అంతటితో తన మోసం ఆగిపోలేదు. తన బినామీల భూములు మినహాయించి తక్కిన రైతుల భూములు ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోవాలని అడుగులు వేశారు. ఇది రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే..తన బినామీలు వాళ్ల భూములు అమ్ముకునేందుకు ఎటువంటి ఇబ్బందులు రాకుడదని రెండు జిల్లాలను జోనింగ్‌ చేశారు. వారి భూములు అమ్ముకునేందుకు అనుకూల జోన్‌లో పెట్టారు. మిగిలిన రైతుల భూములు అగ్రికల్చర్‌ జోన్‌లో పెట్టి అమ్ముకోకుండా చేశారు. తాను చేస్తున్న అన్యాయాలు, మోసాలు ఇంతటితో ఆగిపోలేదు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరు చెప్పి దాదాపు 33 వేల ఎకరాలు తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. అందులో కొందరు ల్యాండ్‌ పూలింగ్‌కు ఒప్పుకోలేదు. బాబు భూకాంక్ష అంతటితో ఆగిపోలేదు. అసైన్డ్, లంక, వక్ఫ్‌ భూములు వదల్లేదు. అన్నీ టెంపరరీనే. టెంపరరీ సెక్రటేరియట్‌ కట్టడానికి రూ.650 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల అసైన్డ్ భూములను చంద్రబాబు తన అత్తగారి సొత్తన్నట్టు లాక్కుంటున్నాడు. పేదలకు గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను దోచుకోవడం దారుణం.  


రైతులకు మేలు జరుగకూడదన్న దిక్కుమాలిన ఆలోచనతో చంద్రబాబు తనకు నచ్చిన వారికి నచ్చిన రేట్లకు భూములు ఇస్తున్నారు. మీరే మాట్లాడండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా మీరే చెప్పండి.
 
గాంధీ(లింగాయపాలెం రైతు)
నాకు 24 ఎకరాలుంది. గ్రామకంఠంలో ఎవరికి లేనంత భూమి ఉంది. కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కాని రీతిలో దోపిడీ జరుగుతోంది. దళిత సోదరులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నదీతీర ప్రాంతంలో డాలర్ల వర్షం కురుస్తుందని చంద్రబాబు, ఆయన కొడుకు భూములను దోచేస్తున్నారు. దేవినేని ఉమ 6వేల ఎకరాలు ఆక్రమించారు. దళితులను భయపెట్టి లంకభూముల్ని లాక్కుంటున్నారు. రైతులను భయపెట్టి 33వేల ఎకరాలు, దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను దోచుకుంటున్నారు. బొంగులు తగలబెట్టించావ్. తగలబెట్టించిన ఒక్కడిని కూడా పట్టులేదంటే బాబు రాష్ట్రాన్ని ఎంత దారుణంగా పాలిస్తున్నాడో చూస్తున్నాం. దళితులు, రైతులు చైతన్యవంతమైన రోజున చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని బ్రేక్ చేసుకోవాల్సిందే. దళితులకు వాళ్ల గ్రామంలో భూములిస్తామని చెప్పి మోసం చేశారు. మంత్రులే డైరెక్ట్ గా మీ భూములు ఆక్రమించామని చెబుతూ  బెదిరిస్తున్నారు. రైతు కూలీలను చంద్రబాబు రోడ్డున పడేశాడు. 

రాజేశ్వరరావు(దళిత రైతు)
అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడి మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నా. దళితుల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కనబెట్టి 
చంద్రబాబు మాకు అన్యాయం చేస్తున్నారు. మీది లంక భూమి, కాగితాలు లేవు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ టీడీపీ నేతలు
బెదిరిస్తున్నారు. సీఆర్డీఏ అధికారులు, సీఎం, మంత్రి నారాయణ ఎవరి దగ్గరకు వెళ్లినా పట్టించుకోలేదు. మేం చెప్పిందే శాసనమన్నట్లు ఓట్లేయించుకొని మమ్మల్ని మోసం చేశారు. నాకున్న రెండెకరాల్లో అప్పులపాలై ఎకరం అమ్మాను. ఉన్నది ఎకరం. 120 ఏళ్ల నుంచి సాగుచేసుకున్న భూమి. మా భూములను లాక్కునే అధికారం బాబుకు ఎవరిచ్చారు . మాకు అన్యాయం జరిగితే సహించం. మేం చనిపోయినా సరే మా భూములు మాత్రం ఇచ్చేది లేదు. 

Back to Top