'ధైర్యం ఉంటే ఎన్నికలు నిర్వహించండి'

ఒంగోలు, 9 మే 2013: ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. సిబిఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణిని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు. మద్యం బెల్టుషాపులు ఎత్తివేయిస్తానంటున్న చంద్రబాబు ముందుగా టిడిపి ఎమ్మెల్యేలు నడిపిస్తున్న బ్రాందీషాపులను మూసివేయించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సర్వసన్నద్ధంగా ఉండాలని బాలినేని శ్రీనివాసరెడ్డిరెడ్డి పిలుపునిచ్చారు.
Back to Top