చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు


చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో కూడా జిల్లాలోని చక్కెర పరిశ్రమలు మూత వేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తెరిపించి రైతులకు మేలు చేశారన్నారు. మళ్లీ మా ఖర్మ కొద్ది బాబు ముఖ్యమంత్రి కావడంతో ఆ పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మా బతుకులు బాగుపడుతాయని ప్రజలు భావిస్తున్నారని, ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top