వైయస్‌ జగన్‌కు చెన్నై విద్యార్థుల సంఘీభావం

గుంటూరు:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు చెన్నైకి చెందిన ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు సంఘీభావం తెలిపారు. శనివారం విద్యార్థులు గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో వైయస్‌ జగన్‌ను కలిశారు. 500 కిలోమీటర్ల నుంచి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వచ్చారు. వైయస్‌జగన్‌తో కలిసి వారు కొంత దూరం అడుగులో అడుగు వేస్తూ నడిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హోదా సాధించగల సమర్ధుడు వైయస్‌ జగన్‌ అని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను వైయస్‌ జగన్‌ నెరవేర్చుతారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేషస్పందన లభిస్తుందన్నారు. వైయస్‌జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top