చంద్రబాబు రాజకీయ వ్యభిచారం

  • ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • ఎంపీకి కోట్లాది రూపాయల ఎరవేశారు
  • వైయస్సార్సీపీని బలహీనం చేయాలనుకుంటే పొరపాటే
  • మంత్రులకు పదవులు..అధికారాలన్నీ లోకేష్ చేతిలో
  • మేధావులు.. పాత్రికేయులు.. ప్రజాస్వామ్యవాదులు తిడుతున్నా మారని బాబు తీరు
  • చంద్రబాబుపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజం
విజయవాడః ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని  వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. మేధావులు, పాత్రికేయులు, ప్రజాస్వామ్యవాదులంతా తిడుతున్నా కూడ చంద్రబాబు బుద్ధి మారడం లేదని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీని తీసుకొని పార్టీని బలహీనం చేయాలని బాబు అనుకుంటే అది పొరపాటేనన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి  పార్థసారధితో కలిసి జోగి రమేష్ మాట్లాడారు. కోట్లాది రూపాయల డబ్బును ఎరగా చూపి ఓ ఎంపీని కొనుగోలు చేసి బాబు మళ్లీ తన రాజకీయ వ్యభిచారం మొదలుపెట్టాడని విమర్శించారు. బలహీన వర్గాల మహిళగా తాను అతున్నత పార్లమెంట్ లో అడుగుపెట్టానంటే అది జగనన్న సీటు ఇవ్వడం వల్లేనని,  వైయస్సార్సీపీని వదలిలేది లేదన్న బుట్టా రేణుక ఏం ఆశించి టీడీపీలో చేరారో చెప్పాలన్నారు. బుట్టా రేణుక గెలిచిన మూడో రోజే ఆమె భర్త బాబుతో లాలూచీ పడ్డారని గుర్తు చేశారు. 

పేపర్, టీవీల్లో బొమ్మలు చూపించి ఇదే అభివృద్ధి అంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తీరు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని డిజైన్ల కోసం రాజమౌళిని లండన్ పంపించడం చూస్తుంటే బాబు మానసిక స్థితికి ఏమైందో అర్థం కావడం లేదన్నారు. బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జోగి నిప్పులు చెరిగారు. మా నాయకుడు వైయస్ జగన్ నిన్న బలహీన వర్గాల మీటింగ్ పెడితే...జగన్ మీద దాడి చేయండంటూ ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి మంత్రులకు పదేపదే ఫోన్లు వెళ్లడం దారుణమన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలకు ఇచ్చిన మంత్రి పదవి అలంకార ప్రాయమని, అధికారాలన్ని లోకేష్ కు అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. వీఆర్వో, వీఆర్ఏలను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం కూడ లేని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్టమూర్తి ...వైయస్ జగన్ ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. జగన్ ను తిడితే బాబు మెడల్స్ ఇస్తారనుకోవడం మంత్రుల భ్రమేనన్నారు.  కాల్వ శ్రీనివాసులు బోయ కులానికి చెందిన వ్యక్తిగా గౌరవిస్తాం. మూడున్నరేళ్లయింది. బోయ కులస్తులను బీసీలనుంచి ఎస్టీలో చేరుస్తానన్న హామీని నెరవేర్చమని బోయ కులానికి చెందిన మంత్రి కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. అంటే,  మీకు మంత్రి పదవి ఇస్తే సరిపోయిందా. ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చరా అని నిలదీశారు. బోయ కులస్తులను మోసం చేసిన నీవు వైయస్ జగన్ ను తిట్టే కార్యక్రమం చేస్తావా అంటూ కాల్వపై నిప్పులు చెరిగారు. 
Back to Top