'బిజెపితో దోస్తీకి చంద్రబాబు కసరత్తు'

ఒంగోలు, 24 జూన్‌ 2013:

తొమ్మిదేళ్ళుగా అధికార పీఠానికి దూరమై అల్లాడిపోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలాగైనా దాన్ని సాధించాలని ఎత్తులు, పైయెత్తులు వేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాజాగా ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం కసరత్తు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి అన్నారు.‌ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారని ఆయన సోమవారంనాడు హైదరాబాద్‌లో విమర్శించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యేందుకు టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయని బాలినేని ఆరోపించారు. కుమ్మక్కయిన పార్టీలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని బాలినేని వ్యాఖ్యానించారు.

Back to Top