భూకేటాయింపుపై టీడీపీ చర్చకు రావాలి: భూమన

హైదరాబాద్ 21 జూన్ 2013:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో కృష్ణపట్నం ఓడరేవుకు 12వేల ఎకరాల భూమిని కేటాయించారని వైnస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాన్ని ఆయన ఈ సందర్భంగా బహిర్గతం  చేశారు. దీనిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామlw, అందుకు టీడీపీ సిద్ధమేనా అని ఆయన  సవాలు చేశారు. ఐఎంజీ కేసును తప్పుదోవ పట్టించడానికే ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని భూమన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు కథనం ఏదో ఒకటి రాస్తుందని ముందే ఊహించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ముంటే కృష్ణపట్నం భూములు వ్యవహారంపై చర్చకు రావాలని అన్నారు.

Back to Top