బరితెగించిన టీడీపీ నాయకులు

అనంతపురం: తెలుగు దేశం పార్టీ నాయకులు బరితెగించారు. అధికారం ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. మొహరం పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని ఎస్‌. మల్లాపురం గ్రామంలో టీడీపీ వర్గీయులు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోంది. మల్లాపురం గ్రామంలో పీర్లు జలదికి వెళ్లిన తరువాత టీడీపీ వర్గీయులు హనుమంతరాయుడు, కిష్టప్ప, సుధాకర్, మారుతేజ్, నాగేష్, పాతలింగ, మారెప్ప తదితరులు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అగ్నిగుండం వద్దకు రాకూడదంటూ హుకుం జారీ చేశారు. అగ్నిగుండం సమీపంలో నిలబడ్డ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు మల్లప్ప, విశాలమ్మ, అంజప్ప, కదరప్ప, నాగరాజు తదితరులపై టీడీపీ నాయకులు రాళ్లు,కట్టెలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. సృహక్పోయిన క్షతగాత్రులను గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు నరశింహులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. 

వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైయస్‌ఆర్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, మండల కన్వీనర్‌ సత్యనారాయణశాస్త్రి, జడ్‌పీటీసీ మాజీ సభ్యులు రాజగోపాల్, మాజీ సర్పంచులు గవియప్ప, లింగప్ప, తిప్పేస్వామి తదితరులు పరామర్శించారు. అయితే దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై 24 గంటలు గడిచిన కూడా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ కేసును నీరుగార్చేందుకు జిల్లాకు చెందిన మంత్రులు పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కాగా దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతలను కఠినంగా శిక్షించాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.
Back to Top