లక్షల కోట్లు కొట్టేసేందుకు బాబు స్కెచ్

హైదరాబాద్ః రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో సింగపూర్ కంపెనీలకు, చంద్రబాబు బృందాలకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేశారని  అంబటి రాంబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  రాజధాని ముసుగులో రైతుల భూములతో ప్లాట్ల వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేశారని అంబటి ధ్వజమెత్తారు. కోర్టు తప్పుబట్టడంతో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. 
Back to Top