అవినీతిలో బాబు సీనియారిటీ

  • హోదా రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు
  • ముఖ్యమంత్రి హోదా కోసం రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు
  • హోదా కోసం మూడేళ్లుగా వైయస్ జగన్ ఎనలేని పోరాటాలు
  • సీనియర్ నని భజన చేసుకోవడం బాబుకు బాగా అలవాటైపోయింది
  • సీనియారిటీ కన్నా సిన్సియారిటీ ముఖ్యమని బాబు తెలుసుకోవాలి
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్ః చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్నాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని కేంద్రాన్ని నిలదీయలేక..తన ముఖ్యమంత్రి హోదాను కాపాడుకునేందుకు ఐదుకోట్ల మంది ఆశలను భూస్థాపితం చేస్తున్నాడని రోజా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  లేని గ్రోత్ రేటును చూపిస్తూ బాబు కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి  హోదా రాకుండా చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని  చంద్రబాబును హెచ్చరించారు. మహానేత వైయస్ఆర్ ను అభిమానించే వాళ్ల సంతోషం కోసం, ప్రజలకు కష్టాలు కలగకూడకుండా ఉండడం కోసమే వైయస్ జగన్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారని రోజా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.  ప్రత్యేకహోదా కోసం పోరాడే పార్టీలతో కలిసి వచ్చినా, లేక చంద్రబాబే పోరాటం చేసినా తాము మద్దతిస్తామని ముందునుంచి చెబుతున్నామన్నారు. ప్రత్యేకహోదా కోసం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. 
 
ప్రత్యేకహోదా వల్ల ఏం లాభం..? ప్రత్యేకహోదాతో ఏమి వస్తాయన్న చంద్రబాబు... అసెంబ్లీలో రెండుసార్లు ఎందుకు తీర్మానం చేశారో చెప్పాలన్నారు.  కేంద్రమంత్రుల కాళ్లు పట్టుకోవడానికి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు...హోదా కోసమే వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లానని ఎందుకు చెప్పుకున్నారో తెలపాలని  నిలదీశారు. ప్రత్యేకహోదా వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వెళితే తెలుస్తుందని బాబుకు సూచించారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన మీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమష్ లాంటి నాయకులను అడిగి తెలుకోవాలని చురక అంటించారు.  అధికారంలో ఉండి కూడ చంద్రబాబు ఏపీకి హోదా రాకుండా కుట్రపన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు హోదాపై డిస్కస్ చేద్దామని వైయస్ జగన్ అడిగితే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. హోదా వల్ల ఏం లాభమని బాబు అనడం ాయన సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. హోదా కన్నా ప్యాకేజే గొప్పదని మాట్లాడుతున్నావ్..? నీవు తెచ్చిన ప్యాకేజీతో ఎంత మందికి ఉద్యోగాలు తీసుకొచ్చావ్..? ఎన్ని నిధులు, పరిశ్రమలు తెచ్చావో  చెప్పగలవా బాబు అని నిలదీశారు. 

ఏపీకి 15ఏళ్లపాటు ప్రత్యేకహోదాను ఇచ్చే ప్రక్రియను శీఘ్రతరం చేయాలి, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి,  ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వాలని మీరు కోరలేదా బాబు..? 2014 జూన్ 21న అధికారంలోకి వచ్చాక గవర్నర్ కు రాసిచ్చిన స్పీచ్ లో చెప్పిన మాటలేమయ్యాయి బాబు అని రోజా నిలదీశారు.  హోదా, ప్యాకేజీ రెండు వేరు, ఈ రెండిస్తేనే ప్రజలు అభివృద్ధి బాట పడతాని మీరు చెప్పింది వాస్తవమా కాదా బాబు అని ప్రశ్నించారు. బాబు తన అబద్ధాల గ్రోత్ రేటుతో హోదా రాకుండా చేయాలని కుట్రపన్నడం బాధాకరమని రోజా అన్నారు. ప్రత్యేకహోదా కోసం మూడేళ్లుగా వైయస్ జగన్ ఎన్ని పోరాటాలు చేశారో,  ఢిల్లీకి వెళ్లి తెలుగోడి సత్తాను ఏవిధంగా చూపారో ప్రజలందరికీ తెలుసునన్నారు. రాజధాని లేక,  మూడేళ్లుగా కరువు, తుఫాన్ లతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే ....దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటులో నంబర్ వన్ అని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిపోయిందని రోజా విమర్శించారు. అమెరికాలో వృద్ధిరేటుతో పోటీపడిందని చెప్పడం విని అంతా  వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని అనుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.

 రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, 16వేల కోట్లు ఇవ్వాలన్న చంద్రబాబు...కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. నేను ఎవ్వరికీ భయపడనన్న చంద్రబాబు...4 వేల కోట్లతో ఎందుకు సర్దుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. మాట్లాడితే  నేను సీనియర్ నని భజన చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందని రోజా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఉండాల్సింది సీనియారిటీ కాదని సిన్సియారిటీ
ముఖ్యమన్న సంగతి బాబు తెలుసుకోవాలన్నారు. ఎన్టీర్ సీనియారిటీ ప్రకారం వస్తే ఎందుకు వెన్నుపోటు పొడిచావు బాబు..?మీకన్నా సీనియర్లు అయిన  యనమల, అశోకగజపతి రాజులను ముఖ్యమంత్రిలను చేయకుండా మీరెందుకు ముఖ్యమంత్రి అయ్యారు బాబు అని రోజా నిప్పులు చెరిగారు. బాబు అవినీతిలో సినీయారిటీ తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని రోజా ఆరోపించారు. మోదీ నా రాష్ట్రానికి వస్తే ఉరితీస్తానన్న చంద్రబాబు...ఆయన ప్రధాని అయ్యాక కాళ్ల బేరానికి వచ్చాడని రోజా ఎద్దేవా చేశారు.
Back to Top