ఏ ఒక్క హామీ అమలు కాలేదు -మోపిదేవి వెంకటరమణ

పశ్చిమ గోదావరి: ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. నరసాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  దేశ చరిత్రలోనే ఒక ప్రజా నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టింది లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఒక్కరికే ఆ ఖ్యాతి లభించిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మట్టి, ఇసుకను దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అమలుకు సాధ్యంకాని హామీలతో మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారన్నారు. తాటా తీస్తానని మత్స్యకారులను హెచ్చరించారని గుర్తు చేశారు. నరసాపురంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తానని చెప్పి మాట తప్పారన్నారు. టీడీపీని కూకటి వేళ్లతో పెకలిస్తారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యేందుకు నిరంతరం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. 
Back to Top