బాబుకు పుట్టుకతో వచ్చిన బుద్ధులవి

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన
హామీలన్నిటిని తుంగలోకి తొక్కుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబుకు పుట్టుకతోనే 420
లక్షణాలు వచ్చాయని సీనియర్ నాయకులు బివై రామయ్య ధ్వజమెత్తారు. జంతర్ మంతర్ వద్ద
జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ  4-20(ఏప్రిల్ నెల 20 వ తేదీన)పుట్టక పుట్టిన చంద్రబాబు
నాయుడికి ఆలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడని మండిపడ్డారు. బీసీలకు 110
హామీలిచ్చి ఒక్కదానిని కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికలై గద్దె ఎక్కగిన తరువాత,
హామీల గురించి అడిగితే అరెస్టులంటారు, బెదిరిస్తారు తోకలు కత్తిరిస్తా నంటూ వారిపై
జులం చేయడం తప్ప చేసిందేమీ లేదని రామయ్య దుయ్యబట్టారు. చంద్రబాబు పోతే తప్ప ప్రజల
జీవితాలు బాగుపడవన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top