బాబుదే దొంగ మనస్తత్వం:భూమన

తిరుపతి :

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కోట్ల మంది సంతకాలు చేస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందన్న అక్కసుతో అవాస్తవాలు పలుకుతున్నారన్నారు. దొంగ మనస్తత్వం గల చంద్రబాబు నోట ఏనాడు వాస్తవం రాలేదని ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు కోటి సంతకాలపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. శ్రీ జగన్మోహనరెడ్డి అరెస్టుకు నిరసనగా జనం ఇప్పుడు స్పందించినట్లే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా స్పందిస్తారన్నారు. చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పవని భూమన జోస్యం చెప్పారు.

Back to Top