క్షురకులపై దాడి హేయమైన చర్య

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షురకుడిపై దేవాలయ బోర్డు మెంబర్‌ దాడి చేయడాన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండించింది. నాయీ బ్రహ్మాణులను దుర్భాషలాడి.. దాడి చేయడం హేయమైన చర్య అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు అన్నారు. దుర్గ గుడి కార్యాలయం వద్ద నాయీ బ్రహ్మాణులు చేస్తున్న ఆందోళనకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు తెలిపింది. భక్తులు నుంచి క్షురకులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణపై బోర్డు మెంబర్‌ పెంచెలయ్య ఈఓకు చెప్పి చర్యలు తీసుకోవాలనే నిబంధన తెలియదా అని ప్రశ్నించారు. అమ్మవారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా బోర్డు ప్రవర్తిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి నాయీ బ్రాహ్మాణులకు క్షమాపణలు చెప్పి... పెంచెలయ్యను సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. 
Back to Top