ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం

ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చర్చించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటు నినదించారు. అయినా సరే అధికార పక్షం వినిపించుకోలేదు. పైగా స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. దీనికి తోడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మైక్‌ ఇచ్చి ప్రతిపక్ష సభ్యులను తిట్టించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Back to Top