జేసీ బ్రదర్స్ పై అనంత ఆగ్రహం

అనంతపురం :జేసీ బ్రదర్స్ పై  మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే వారిని బెదిరించడం జేసీ బ్రదర్స్ కు అలవాటు అని ధ్వజమెత్తారు. తాడిపత్రి ఆడపడుచు వైయస్ విజయమ్మపై దూషణలు చేయడం సభ్యత కాదని జేసీపై నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంపై హేలనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తేల్చుకుందాం రా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారని, నిజంగా జేసీ బ్రదర్స్ కు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు వైయస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Back to Top