పచ్చచొక్కాలతో పోలీసుల డ్యూటీ

విశాఖపట్నంః  రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిప్పులు గక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రజాసమస్యలపై ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలను అణచివేసి సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టాలన్న దురుద్దేశ్యంతో పోలీసులు పనిచేయడం బాధాకరమన్నారు.  వైఎస్సార్సీపీ ప్రజాసమస్యలపై పోరాడితే  చాలు అన్ని సెక్షన్లు అమలులోకి వస్తాయని, ఇదంతా చూస్తే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 

అనూష కేసులో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆడియో రికార్డింగు ద్వారా నిర్ధారణ అయినా పోలీసు కమిషనర్ పట్టించుకోలేదని, అలాగే సీఐ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కూడా పురోగతి లేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కమిషనరేట్లో పైరవీలు చేసేవారికే పోస్టింగులు వస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితిలోనూ భయపడేది లేదని, సమస్యలపై   ప్రజల పక్షాన తమ పోరాటాన్నితీవ్రతరం చేస్తామని అమర్నాథ్ తేల్చిచెప్పారు.

Back to Top