ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌

రాజంపేటః రంజాన్‌ పండుగను పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక ప్రార్దనల సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైయస్సార్‌ సీపీ మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముస్లిం సోదరులకు ఆత్మీయంగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గొన్న ముస్లీంలను ఆకేపాటి, పోలాలు అలింగనం చేసుకొని వారితో రంజాన్‌ సంతోషాన్ని పంచుకున్నారు. రంజాన్‌ ముస్లీం మోముల్లో చిరునవ్వులు నింపి ఏడాదంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకేపాటి ఆకాంక్షించారు. ఇదిలావుండగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఈద్గా వద్దకు వచ్చిన ఆకేపాటి, పోలాలను ముస్లీం సోదరులు తమ సాంప్రదాయం ప్రకారం టోపి, రుమాల్‌లతో సన్మానించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డి, మత పెద్దలు నూరుద్దీన్, హైదర్, వైయస్సార్‌ సీపీ ముస్లీం మైనార్టీ నేతలు ఎస్‌ఆర్‌.యూసఫ్, ఎస్‌.జాహీద్‌అలీ, ఎస్‌.జాకీర్‌హుస్సేన్, సలీమ్, అలీమ్, నాయబ్‌ తదితరలు పాల్గొన్నారు.

Back to Top