వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన వైెెఎస్సార్సీపీ

హైదరాబాద్) శాసనసభ సమావేశాలకు వైెఎస్సార్సీపీ సభ్యులు హాజరు అయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు వచ్చారు. వెనుకబడిన ప్రాంతాలు, పురోగతికి తీసుకోవలసిన చర్యల గురించి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ముఖ్యమైన అంశంగా పరిగణించి మిగిలిన విషయాల్ని పక్కన పెట్టి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ దాటాక ఈ విషయానికి సమయం కేటాయించాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పురోగతి కోసం తీసుకొంటున్న చర్యలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. 
Back to Top