జగన్‌ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకం

 

  తూర్పుగోదావరి :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే ఓ న‌డిచొస్తున్న న‌మ్మ‌క‌మ‌ని సినీ న‌టులు పృథ్వీ, విజయ్‌చందర్‌లు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైయ‌స్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని   పేర్కొన్నారు. మహానేత, దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు వైయ‌స్ జగన్‌ సీఎం అయితేనే అమలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని విజయ్‌ చందర్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు వైయ‌స్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. 

Back to Top