టీడీపీ సర్కార్ పై ఉద్యమ కార్యాచరణ

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లో  ముఖ్య సమావేశం జరుగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు ఈసమావేశానికి హాజరయ్యారు.  భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తోంది. కరువు, తాగునీటి ఎద్దడి సహా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈనేపథ్యంలో నిద్రపోతున్న ఏపీ సర్కార్ ను తట్టిలేపేందుకు పార్టీ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

Back to Top