ఆలయాల దారిలో మహానేత చిత్తరువులు

శ్రీకాళహస్తి:

తిరుపతి-చిత్తూరు రహదారి కొత్త అందాలను సంతరించుకుంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబ సభ్యుల వర్ణ చిత్రాలు ఆ దారిలో వెళ్ళేవారికి కనువిందు చేస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ చిత్రకారుడు వీటిని చిత్రించారు. శ్రీకాళహస్తికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన రెడ్డి వీటి ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించారు. శ్రీకాళహస్తి.. తిరుపతి రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కర్మాగారాల ప్రహరీలు ఈ చిత్రాలకు వేదికయ్యాయి. ఆ దారి వెంట వెళ్ళేవారు అద్భుతమైన ఆ చిత్ర కళను ఆస్వాదించడానికి ఆగి మరీ చూస్తున్నారు.
   
     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రాలతో పాటు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్రలు, దీక్షలు, ఉద్యమాలలోని వివిధ దశలకు చిత్రరూపాన్ని కల్పించారు. శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలను కూడా చిత్రబద్ధం చేశారు.

    చిత్రీకరణకు రెండు నెలల సమయం తీసుకున్నారు. ఈ చిత్రాలు ఆసక్తికరంగా కనిపించడమే కాక.. మహానేత కుటుంబం చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదుతున్నట్లుగా ఉన్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటుగా వెళ్ళేవారికి డాక్టర్ వైయస్ఆర్ కుటుంబ గొప్పతనం ఈ చిత్రాల ద్వారా బోధ పడుతుందని అంటున్నారు.

Back to Top