30వ రోజు పాదయాత్ర ఆరంభం

మంత్రాలయం:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల తన ముప్పయ్యో రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఎచ్ మార్వాని నుంచి ఆమె తన యాత్ర ఆరంభించారు. మంత్రాలయం ఎమ్మెల్యే టి. బాలనాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, తదితరులు ఆమె వెంట ఉన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు షర్మిల వెంట నడిచారు. గురువారం పాదయాత్రలో ఆమె మంత్రాలయం నియోజకవర్గంలో నడిచారు. వివిధ వర్గాల ప్రజలను కలిశారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే కష్టాలు తొలగుతాయనీ, కొద్ది రోజులు ఓపిక పట్టాలని ఆమె వారిని కోరారు. పెద్ద కడుబూరులో ఏర్పటైన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

Back to Top