అమలాపురం: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ఉద్యోగాల కల్పన, పారదర్శక నియామకాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత హక్కుల సాధన కోసం వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశ్, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ, కటకంశెట్టి ఆదిత్య, పాటి శివకుమార్, వంటెద్దు వెంకన్నాయుడు, గొల్లపల్లి డేవిడ్, గ్రంథి రవి, పీకే రావు, పితాని బాలకృష్ణ, కుడుపూడి బాబు, కాశీ మునికుమార్, శక మణికుమారి, తోరం సూర్యభాస్కరరావు, సంసాని నాని, కొనుకు బాపూజీ, వర్మ, జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, కొనుకు గౌతమి, విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల రమేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు శిరీష్‌తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.