బి.ఆర్.నాయుడుపై చర్యలు తీసుకోవాలి

టీటీడీ పరిపాలన భవనంలో ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు

 తిరుపతి: భగవద్గీత పుస్తకాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ టిటిడి పరిపాలన భవనంలో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.  భ‌క్తుల‌కు సుల‌భంగా, స‌ర‌ళంగా అర్థ‌మ‌య్యే విధంగా ముద్రించిన భగవద్గీత పుస్తకాల‌పై బీఆర్ నాయుడు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు.  ఇప్పటి వరకు 52 లక్షల పుస్తకాలను భక్తులకు పంపిణీ చేసినట్లు, ఇందుకోసం రూ.3.71 కోట్లు ఖర్చు చేయ‌గా, రూ. 50 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై బీఆర్ నాయుడు  అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిటిడి చైర్మన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రకటనలను నిలవనివ్వరాదు అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, ఆరే. అజయ్, పసుపులేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top