టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాజీ సర్పంచ్‌కు ఎమ్మెల్సీ ప‌రామ‌ర్శ 

బాధితుడికి వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా

 కుప్పం: రామకుప్పం మండలం పెద్దతండా పంచాయతీ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ ఆయనను పరామర్శించారు. జూలై 21వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో మోహన్ నాయక్ గాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చికిత్స పొందుతున్న ఆయనను కేఆర్‌జే భరత్ కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మోహన్ నాయక్‌కు ధైర్యం చెప్పిన భరత్, ఎలాంటి ఆందోళన చెందవద్దని, బాధితుడికి, ఆయన కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 

Back to Top