నేడు క్రాంతి కుమార్‌ ఇంటికి వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించునున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైయ‌స్‌ జగన్‌ పరామర్శించనున్నారు. కాగా, సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Back to Top