ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత

 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా:  పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యు­లు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్సులో హైద­రాబాద్‌ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందో­ళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పి­నట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్‌ తెలిపారు.

Back to Top