మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం 

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి
 

అసెంబ్లీ: రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందిస్తున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ మహిళా భద్రత బిల్లు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి బిల్లును సీఎం తీసుకువస్తున్నారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా ఉండకూడదన్నదే సీఎం ఉద్దేశమన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా, ఇటీవల జరుగుతున్న సంఘటనలు మనసును కలిచివేస్తుందన్నారు. ఆడబిడ్డ బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తుందా అన్న భయంతో క్రుంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టం అవసరమన్నారు. 

Read Also: ఓ తండ్రిలా ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచన చేస్తున్నారు

Back to Top