గుంటూరు: వైయస్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, “ప్రజలను తప్పుదారి పట్టించేలా కొందరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి దుష్ప్రచారాన్ని సహించబోము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఫర్జానా, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, జిల్లా ఎస్సీ విభాగం జనరల్ సెక్రటరీ త్రివేణి, రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ బుల్ల మేరీ, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు సత్తెనపల్లి రమణి, జిల్లా వాలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.