తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.