ఓ తండ్రిలా ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచన చేస్తున్నారు

ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
 

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ తండ్రిలా మహిళల భద్రత గురించి ఆలోచన చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న రేపు, మర్డర్‌ వంటి సంఘటనలు దారుణంగా ఉన్నాయన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. ఆరు నెలల పాలనలోనే అద్భుతాలు చేశారన్నారు. ఈ రోజు మహిళా భద్రతపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సభలో ప్రవేశపెడుతున్న బిల్లులను స్వాగతిస్తున్నామన్నారు. మహిళల గురించి సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఓ తండ్రిగా ఆలోచన చేసి మహిళల భద్రతకు చట్టం తెస్తామని సీఎం చెప్పడం ఆనందంగా ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం విప్లవాత్మకమార్పులు బాగున్నాయన్నారు. అందరికి న్యాయం చేసేలా రూపొందిస్తున్న మహిళా బిల్లుకు అందరు హర్షిస్తున్నారన్నారు. ఆకాశంలో సగమని నీతులు చెప్పిన చంద్రబాబు వారి గురించి ఆలోచన చేయడం లేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మహిళల గురించి ఆలోచించడమే కాకుండా పదవులు, పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. మద్యం నియంత్రించడం వల్ల మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. చట్టాల్లో మార్పులు త్వరగా తీసుకొస్తే ఇలాంటి ఆకృత్యాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం శుభపరిణామన్నారు. 

Read Also: మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై సూచ‌న‌లు ఇవ్వండి

Back to Top