పేద‌ల హృద‌యాల్లో వైయ‌స్ఆర్ చిర‌స్మ‌ర‌ణీయుడు

సౌత్ ఆఫ్రికాలో వైయ‌స్ఆర్ వర్ధంతి కార్యక్రమం 

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వ‌ర్యంలో అనాథాశ్రమానికి ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు అంద‌జేత‌

తాడేప‌ల్లి:  సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి పేద‌ల హృద‌యాల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి చిర‌స్మ‌ర‌ణీయుడిగా నిలిచాపోయార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత‌లు కొనియాడారు. వైయ‌స్ఆర్ 16వ వర్థంతి సందర్భంగా సౌత్ ఆఫ్రికా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వ‌ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని “Ivory Park Community Centre Daycare” అనాథాశ్రమానికి ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు అంద‌జేశారు. 

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయ‌కులు, పార్టీ కార్యకర్తలు దివంగత మహానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు.  పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే వైయ‌స్‌ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని స్మ‌రించుకున్నారు.

మాలో చాలామంది వైయ‌స్‌ఆర్  ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సహా అనేక పథకాల ద్వారా తమ చదువును పూర్తి చేసుకున్నామని, ఆ పథకాల వలననే ఈ రోజు సమాజానికి తిరిగి సేవ చేయగలుగుతున్నామనే విషయాన్ని భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అనాథాశ్రమంలోని చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు, ఇతర ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. వారి ఆనందం చూసి ఈ కార్యక్రమం నిజమైన అర్థంలో ఘన విజయాన్ని సాధించింది.


 

Back to Top