ఆడదాకులపల్లిలో `కాఫీ విత్ వైయ‌స్ఆర్‌సీపీ క్యాడ‌ర్‌`

ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్న మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

శ్రీ స‌త్య‌సాయి జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పార్టీ శ్రేణుల‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెనుకొండ నియోజకవర్గం ఆడదాకులపల్లి గ్రామంలో సోమ‌వారం ఉదయం `కాఫీ విత్ వైయ‌స్ఆర్‌సీపీ క్యాడ‌ర్‌` కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ్రామంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌ల‌రించి వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. అనంత‌రం  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నాడు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ, నేడు కూటమి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌ట్టారు.  

Back to Top